Kamareddy District: కామారెడ్డి వివాహిత గొంతు కోసిన ఘటనలో ట్విస్ట్.. అసలు కారణం తెలిసిన పోలీసులు షాక్

|

Aug 31, 2021 | 12:22 PM

కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది బాధితురాలు.

Kamareddy District: కామారెడ్డి వివాహిత గొంతు కోసిన ఘటనలో ట్విస్ట్.. అసలు కారణం తెలిసిన పోలీసులు షాక్
Assassination Attempted On Kamareddy Woman
Follow us on

Kamareddy Assassination Attempted: కామారెడ్డిలో వివాహిత గొంతు కోసిన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి పరారయ్యారని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది బాధితురాలు. అయితే, సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దాడి వెనుక అసలు కథ బయటికొచ్చింది. ఆమెపై ఎవరూ దాడి చేయలేదని.. తనకు తానే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిందని పోలీసులు నిర్ధారించారు. బాధితురాలు రెండు నెలల క్రితం కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గతంలో ఉన్న ప్రేమ వ్యవహారమే కారణమని కామారెడ్డి పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలావుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బర్కత్ పుర కాలనీకి ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కోసి పరారయ్యాడు అని కుటుంబసభ్యులకు తెలిపింది. కాగా, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Petrol Bunks Bandh: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఇవాళ 3వేల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి.. కారణం ఏమంటే..?

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి, 8మందికి తీవ్రగాయాలు.. దైవ దర్శనం చేసుకుని వస్తుండగా కబళించిన మృత్యువు