Namanveer Singh Brar: భారత షూటర్ అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యగా భావిస్తోన్న పోలీసులు..?

|

Sep 14, 2021 | 11:12 AM

నమన్వీర్ సింగ్ బ్రార్ మొహాలీలోని తన సెక్టార్ 71 ఇంటిలో శవమై కనిపించాడు. కాల్పులు జరిగినట్లు ఆయన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.

Namanveer Singh Brar: భారత షూటర్ అనుమానాస్పద మృతి.. ఆత్మహత్యగా భావిస్తోన్న పోలీసులు..?
Namanveer Singh Brar
Follow us on

Namanveer Singh Brar: జాతీయ స్థాయి షూటర్ నమన్వీర్ సింగ్ బ్రార్ సోమవారం (సెప్టెంబర్ 13) మొహాలీలోని తన ఇంట్లో శవమై కనిపించాడు. 28 ఏళ్ల ట్రాప్ షూటర్‌ తలకు బుల్లెట్ గాయమైందని, మొహాలి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గుర్‌షేర్‌ సింగ్‌ సంధు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కారణాలు తెలుసుకునే పడ్డారు పోలీసులు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్యనా లేదా ప్రమాదావశాత్తు జరిగిందా అనేది ఇంకా తెలియలేదు.

డీఎస్‌పీ ప్రకారం, “నమన్వీర్ సింగ్ బ్రార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురయ్యాడా అని ఖచ్చితంగా చెప్పలేం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించాం. పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నాం. నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఇది మాకు ఎంతో సహాయపడుతుంది” అని సంధు తెలిపారు.

మొహాలీలోని సెక్టార్ 71 ఇంటిలో బ్రార్ శవమై కనిపించడంతో కాల్పులు జరిగినట్లు కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వచ్చి ఆధారలు సేకరించే పనిలో పడ్డారు.

దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో నమన్వీర్ సింగ్ బ్రార్ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం కూడా సాధించాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ (ISSF) ప్రపంచ కప్‌లో కనీస అర్హత స్కోరు (MQS) విభాగంలో పోటీపడ్డాడు.

గతంలో పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న బ్రార్, 2015 లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్, అస్గర్ హుస్సేన్ ఖాన్‌లతో కలిసి పాల్గొని కాంస్యం సాధించారు.

అదే ఏడాది నమన్వీర్ సింగ్ బ్రార్ ఆల్ ఇండియా యూనివర్సిటీ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మరుసటి ఏడాది పోలాండ్‌లో జరిగిన FISU వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రార్ మరోసారి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

Also Read: Andhra Pradesh: లారీ డ్రైవర్‌కు షాక్‌.. కళ్లముందే లక్షలు దోచుకెళ్లారు.. అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది..

Bhadrachalam: భద్రాచలంలో అమానవీయ ఘటన.. ఆడపిల్ల అనే కారణంతో అప్పుడే పుట్టిన బిడ్డను..