Mumbai: అనుమానమే నిజమైంది! రూ. 60 లక్షల విలువైన గంజాయిని తరలిస్తూ..

|

Apr 16, 2022 | 8:59 PM

ముంబాయికి చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ పోలీసులు (anti narcotics cell police) ఈ రోజు (ఏప్రిల్‌ 16) సెంట్రల్ ముంబైలోని ధారవి జిల్లాలో రూ. 60 లక్షల విలువైన..

Mumbai: అనుమానమే నిజమైంది! రూ. 60 లక్షల విలువైన గంజాయిని తరలిస్తూ..
Crime News
Follow us on

Charas smuggling racket busted in Mumbai: ముంబాయికి చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ పోలీసులు (anti narcotics cell police) ఈ రోజు (ఏప్రిల్‌ 16) సెంట్రల్ ముంబైలోని ధారవి జిల్లాలో రూ. 60 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే..

ధారవిలో ఇద్దరు వ్యక్తులు ఇతర స్మగ్లర్లకు గంజాయిని తరలిస్తున్నట్లు బాంద్రా యూనిట్‌ పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ సెల్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ధారవి కోలివాడ బస్టాప్ దగ్గర మాటువేసిన పోలీసులు శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదాలు చేయగా, వారి వద్ద రూ.60.75 లక్షల విలువైన 2.25 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. నిందితులను రాజస్థాన్‌కు చెందిన సునీల్ నాయక్ (45), బీహార్‌కు చెందిన నెవాజీ అలీమాన్ మియా (60)గా గుర్తించారు. సదరు నిందితులు నగరం శివారు ప్రాంతాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో చురుకుగా పాల్గొంటున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నగరంలో ఈ డ్రగ్స్‌ ఎవరికి సరఫరా చేశారనే విషయం విచారణలో తెలుసుకుంటామని, వివరాలు సేకరించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఒక అధికారి తెలిపారు.

Also Read:

India Post Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! 8వ తరగతి అర్హతతో పోస్టాఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..