ప్రియునితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి

సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది ఓ మహిళ. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో కన్న కొడుకు కడతేర్చింది ఓ తల్లి. తల్లి అనడానికే అనర్హురాలైన ఆ మహిళ పేరు...

ప్రియునితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి

Mother killed her own son: సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది ఓ మహిళ. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడన్న కారణంతో కన్న కొడుకు కడతేర్చింది ఓ తల్లి. తల్లి అనడానికే అనర్హురాలైన ఆ మహిళ పేరు ఉషా. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచి పల్లిలో ఈ దారుణం జరిగింది. ప్రియుని సహకారంతో కన్న కొడుకును చంపేసి.. ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటి మరీ ఖననం చేసి వచ్చిన ఉదంతం ఇది. స్థానికులిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిజం నిగ్గు తేల్చారు.

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసింది ఉషా అనే మహిళ. రెండు రోజుల క్రితం చిన్న కొడుకుని హత్య చేసింది కన్న తల్లి. ఇందుకు ఆమె ప్రియుడు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు. కొడుకును చంపేసిన తల్లి, ఆమె ప్రియుడు శవాన్ని ఏకంగా రాష్ట్ర సరిహద్దు దాటించి.. తెలంగాణలోని కోదాడకు సమీపంలో పూడ్చేశారు.

రెండు నెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియునితో కలిసి ఉంటున్న ఉషా.. తమ రిలేషన్‌కు అడ్డుగా వున్నాడన్న కారణంతో కొడుకును కడతేర్చినట్లు తెలుస్తోంది. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు పిర్యాదు చేయడంతో ఉషాను, ఆమె ప్రియున్ని పోలీసులు అదుపులోకి విచారించారు. విచారణలో కొడుకును హతమార్చిన సంగతి ఉషా అంగీకరించింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు శ్రీను సహకరించాడని పోలీసులు తెలిపారు. ఉషాను, శ్రీనుని పోలీసులు అరెస్టు చేశారు.

Also read:  బీహార్‌లో బీజేపీ మంత్రాంగం.. ఎల్జేపీలోకి కమలనాథులు

Also read: మోదీకి అమిత్ షా అభినందన… ఎందుకంటే?

Click on your DTH Provider to Add TV9 Telugu