ఆమె యంగ్ డాక్టర్. యాక్టివ్ అండ్ బ్రిలియంట్. కానీ ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. పక్కనున్న మెడికోలు తేరుకుని తట్టిలేపే లోపే ప్రాణాలు విడిచింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. మెడికల్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న శ్వేత అనే వైద్యురాలు ఆకస్మాత్తుగా చనిపోవడం షాక్ గు గురి చేసింది. ఆమె మృతికి కారణం ఏంటి? ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. అర్ధరాత్రి 2 గంటల వరకు గైనిక్ వార్డులో విధులు నిర్వహించిన శ్వేత.. విధులు ముగించుకుని తన రూమ్‌కి వెళ్లిపోయింది. కాసేపాగి అక్కడే కుప్పకూలింది. కంగారుపడ్డ స్నేహితులు ఆమెను లేపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే శ్వేత చనిపోయింది. శ్వేతకు ఇప్పటికే రెండు సార్లు కరోనా సోకింది. అయితే కరోనా కారణంగా వచ్చిన దుష్పరిణామాలే ఆమెను బలిగొన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొవిడ్ కారణంగా శ్వేతకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని చెబుతున్నారు. కళాశాల సూపరింటెండెంట్ ప్రతిమరాజు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు.
వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి సమాచారం అందుకున్న డీసీపీ వినీత్ జిల్లా ఆసుపత్రిలో శ్వేత మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. మృతిపై విచారణ చేస్తున్నామన్న డీసీపీ.. కార్డియక్ అరెస్ట్ గా నిర్ధారణ కు వచ్చామని వెల్లడించారు. పోస్ట్ మార్టం తరువాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి