అమ్మవారి అనుగ్రహం కోసం భార్యను బలిచ్చిన ప్రబుద్ధుడు

మూఢనమ్మకాలతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి. దేవతను ప్రసన్నం చేసుకోవడానికి భార్య తల నరికి బలిచ్చాడు. ఆ తర్వాత ఆమె మృదదేహాన్ని పూజగదిలోనే పాతిపెట్టాడు. తల్లికి ఏదో జరిగిందని అనుమానం వచ్చిన వారి ఇద్దరు కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంధవిశ్వాసానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

అమ్మవారి అనుగ్రహం కోసం భార్యను బలిచ్చిన ప్రబుద్ధుడు

Updated on: Sep 04, 2020 | 4:46 PM

రాకెట్ యుగంలో రాతి యుగం నాటి పోకడలతో జనం మరింత వెనకబడుతున్నారు. మూఢనమ్మకాలతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి. దేవతను ప్రసన్నం చేసుకోవడానికి భార్య తల నరికి బలిచ్చాడు. ఆ తర్వాత ఆమె మృదదేహాన్ని పూజగదిలోనే పాతిపెట్టాడు. తల్లికి ఏదో జరిగిందని అనుమానం వచ్చిన వారి ఇద్దరు కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంధవిశ్వాసానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (50) భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఇటీవలి కాలంలో అతను ఓ దేవతను నమ్మి, ఆమెకు బలులు ఇస్తే తనకు సిరిసంపదలు కలుగుతాయని మూఢనమ్మకం పెంచుకున్నాడు. ఇదే క్రమంలోనే ఓ మేకను బలిచ్చి, దాని కళేబరాన్ని పూజగదిలోనే పూడ్చిపెట్టాడు. అంతటి ఆగలేదు.. తాజాగా, తన భార్య తల నరికి ఆ దేవతకు బలిచ్చాడు. ఆమె శవాన్ని కూడా పూజగదిలోనే పూడ్చిపెట్టాడు. అయితే, ఇంట్లో ఉండే తల్లి కనిపించకుండాపోవడంతో ఇద్దరు పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం బయటకు వచ్చింది. తానే తన భార్యను చంపి పూజ గదిలో పూడ్చిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. గదిలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు.

Loading...
Unable to load recommendations.
Follow Us