Nasik Train Accident: మహారాష్ట్ర(Maharashtra)లోని నాసిక్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. ఎల్‌టిటి-జయనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని పలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. ఎల్‌టీటీ-జయనగర్ ఎక్స్‌ప్రెస్(LTT Jaynagar Express) ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బీహార్‌లోని జయనగర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పిన కోచ్‌లు పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో లహ్విత్ – దేవ్‌లాలీ మధ్య ఈ ఘటన జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న యాక్సిడెంట్ రిలీఫ్ రైలు, మెడికల్ వ్యాన్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారని సీపీఆర్వో తెలిపారు. వారికి ప్రథమ చికిత్స అందించి పంపించినట్లు తెలిపారు.
సెంట్రల్ రైల్వే CPRO ఇచ్చిన సమాచారం ప్రకారం, రైలులోని సుమారు 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో వచ్చే ఇతర రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని మార్గాలను దారి మళ్లించామని తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న RPS బృందం ప్రయాణికులను రైలు నుండి బయటకు తీశారు. విరిగిన ట్రాక్ పైకి వచ్చిన రైలు ప్రమాదానికి గురైనట్లు సీపీఆర్వో తెలిపారు. అదే సమయంలో భయాందోళనకు గురైన ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు రైలులోంచి దూకేసినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
#UPDATE | 2 minor injuries in train derailment in Nashik. Both given primary treatment, not required to be hospitalised. No one else is reported to be injured, no deaths either. One body found near tracks is not of a passenger, & is believed to be there before derailment: CPRO CR pic.twitter.com/tFcqMzB38j
— ANI (@ANI) April 3, 2022
ప్రయాణికుల కోసం రెండో రైలు ఏర్పాటు
రైలు నంబర్ 11061 (ఎల్‌టిటి-జయనగర్ పవన్ ఎక్స్‌ప్రెస్) ఇగత్‌పురి – దేవ్‌లాలీ మధ్య పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వారి లగేజీతో నాసిక్ రోడ్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారు. నాసిక్ నుండి జైనగర్ కోసం ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రయాణీకులందరూ ఈ ప్రత్యేక రైలులో వారి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో పాటు అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రైలు పట్టాలు తప్పిన తర్వాత రైల్వే యంత్రాంగం పూర్తిగా యాక్టివ్‌గా మారింది. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. దీంతో పాటు పలు రైళ్ల మార్గాలను దారి మళ్లించారు. HS నాందేడ్ ఎక్స్‌ప్రెస్, HS నాందేడ్-CSMT ఎక్స్‌ప్రెస్, పూరీ-LTT ఎక్స్‌ప్రెస్, CSMT-అమరావతి ఎక్స్‌ప్రెస్, అమరావతి-CSMT ఎక్స్‌ప్రెస్, CSMT-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. కొన్ని రైళ్లను కొద్దిసేపటికే ముగించగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.
హెల్ప్‌లైన్ నంబర్
కమర్షియల్ కంట్రోల్ HJP – 9771425969
హాజీపూర్ – 8252912078, 7033591016
ముజఫర్‌పూర్ – 8252912066
mbi – 9262297168
spj – 8102918596
dbg – 9264492779
mbi – 9262297168
JYG – 9262297170
Read Also… Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!