ఆలస్యం, అమృతం, విషం మాదిరిగా.. ప్రేమ,పెళ్లి, చావు వరుసగా క్యూ కట్టాయి.. పాపం ఆ నవదంపతులు..

|

Dec 12, 2020 | 8:21 AM

ఆ ఇద్దరు చాలా రోజుల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని అందమైన జీవితాన్ని గడపాలని ఎన్నో కళలు కన్నారు. తమ ప్రేమను

ఆలస్యం, అమృతం, విషం మాదిరిగా.. ప్రేమ,పెళ్లి, చావు వరుసగా క్యూ కట్టాయి.. పాపం ఆ నవదంపతులు..
Follow us on

ఆ ఇద్దరు చాలా రోజుల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని అందమైన జీవితాన్ని గడపాలని ఎన్నో కళలు కన్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని తెలిసి, ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుదామని బయలుదేరేసరికి మృత్యువు వారిని కబలించింది. రోడ్డు ప్రమాదంలో నవజంట మృతిచెందింది. ఈ విషాదకరమైన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్‌, హైదరాబాద్‌లోని గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబసభ్యులను ఒప్పించా లనుకున్నారు. దీంతో హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమ యంలో పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత సతీశ్‌ స్వగ్రామమైన మోడెగాం గ్రామానికి బయ ల్దేరారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి, మహిమను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. నవదంపతులిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.