Ajith Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు.. స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు చేయగా..

Ajith Bomb Threat: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ అభిమానులను ఓ వార్త ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది...

Ajith Bomb Threat: హీరో అజిత్ ఇంట్లో బాంబు.. స‌మాచారం అందుకున్న పోలీసులు త‌నిఖీలు చేయగా..

Updated on: Jun 01, 2021 | 11:30 AM

Ajith Bomb Threat: కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ అభిమానులను ఓ వార్త ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. అజిత్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు గుర్తితెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ కోలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. హీరో అజిత్ అత‌ని భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి తిరువాన్మియూరులో నివాస‌ముంటున్నారు.
ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న ఇంట్లో బాంబు పెట్టిన‌ట్టు గుర్తి తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో ఈ విష‌యాన్ని అజిత్ కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు తెలియ‌జేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకున్నారు. జాగిలాల‌తో ఇల్లు మొత్తం త‌నిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఎలాంటి బాంబు లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఎవ‌రో అఖ‌తాయిలు చేసిన ప‌నిగా భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇక అజిత్ కెరీర్ విష‌యానికొస్తే ఆయ‌న ప్ర‌స్తుతం.. ‘వాలిమై’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే అజిత్‌కు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో 2020లోనూ ఓసారి అజిత్‌కు ఇలాంటి కొంద‌రు అఖ‌తాయిలు ఇలాగే ఫోన్ చేశారు. ఒక‌రోజు త‌ర్వాత పోలీసులు ఫేక్ కాల్ చేసిన వారిని అరెస్ట్ చేశారు.

Also Read: Shakeela Help: ఆకలి తీర్చే దేవతగా మారిన షకీలా..! కుక్ విత్ క్లౌన్ షో నుంచి సేవారంగంలోకి…

Akira Nandan: తండ్రిని మించిన తనయుడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ – అకీరా ఫోటో..

Actress Chandini Case: మూడుసార్లు అబార్షన్.. నగ్న ఫొటోలతో బెదిరింపులు..! నటి చాందిని కేసులో ఎమ్మెల్యే ఆగడాలు..

Loading...
Unable to load recommendations.
Follow Us