అనంతపురం జిల్లాలో యువతుల కిడ్నాప్ కలకలం..

అనంతపురంజిల్లాలో యువతుల కిడ్నాప్ కలకలం రేపింది. శింగనమల మండలం లోలూరు గ్రామంలో ఈ ఉదంతం వెలుగు చూసింది...

అనంతపురం జిల్లాలో యువతుల కిడ్నాప్ కలకలం..

Updated on: Jun 28, 2020 | 12:13 AM

Kidnapped In Anantapur District : అనంతపురంజిల్లాలో యువతుల కిడ్నాప్ కలకలం రేపింది. శింగనమల మండలం లోలూరు గ్రామంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. గ్రామంలోని ఇద్దరు అమ్మాయిలను..స్థానికంగా ఉన్న వాలంటీర్లు కిడ్నాప్ చేశారన్న వార్తలు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామంలో టైలరింగ్‌ చేసే ఇద్దరు అమ్మాయిలు బయటకెళ్లిన సమయంలో…స్థానికంగా ఉండే ముగ్గురు వాలంటీర్లు, మరో ఇద్దరితో కలిసి కారులో వచ్చి అడ్డగించారు. మత్తుమందు కలిపిన గుడ్డను నోటికి అడ్డంపెట్టి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. అయితే దుండగుల నుంచి తప్పించుకుని వచ్చిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీపక్కీలో జరిగిన ఈ  ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తుల నుంచి ప్రాణపాయం ఉందని… తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోయారు.