అనుమానాస్పద నౌకపై కోస్ట్ గాడ్స్ దాడి.. రూ.3,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం

|

Apr 19, 2021 | 6:19 PM

అక్రమార్కులపై నిఘా పెట్టిన భారత రక్షణ దళం మరో విజయం సాధించింది. భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

అనుమానాస్పద నౌకపై కోస్ట్ గాడ్స్ దాడి..  రూ.3,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల స్వాధీనం
Indian Navy Recovers Narcotics Worth 3000 Crore
Follow us on

Indian navy recovers Huge drugs: అక్రమార్కులపై నిఘా పెట్టిన భారత రక్షణ దళం మరో విజయం సాధించింది. భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే ఓ నౌక నుంచి 300 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను పట్టుకున్నట్లు ఇండియన్‌ నేవి న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి వెల్లడించింది. వీటి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తోన్న ఐఎన్‌ఎస్‌ సువర్ణ సిబ్బంది.. ఓ నౌకపై దాడి చేసింది. ఇందులో తరలిస్తున్న డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది.

అరేబియా సముద్రంలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఐఎన్‌ఎస్‌ సువర్ణ.. చేపలు పట్టే నౌక ఒకటి సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించింది. వెంటనే రంగంలోకి దిగి.. సదరు నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఇందులో తరలిస్తున్న 300 కేజీలకు పైగా డ్రగ్స్‌ను గుర్తించింది భారత నావికా దళం. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని.. విచారణ నిమిత్తం నౌక, దానిలో ఉన్న సిబ్బందిని కేరళ కొచ్చి తీరానికి తరలించింది. ఈ నౌక ఎవరికి సంబంధించింది.. దీనిలో రవాణ చేస్తున్న డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తుందన్న దానిపై కోస్టల్ గాడ్స్ ఆరా తీస్తున్నారు. కాగా, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం పట్ల భారత నావికా దళం మరోసారి అప్రమత్తమైంది. తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేసింది.


Read Also..  Telangana High Court : 48 గంటల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకోండి.. లేదంటే మేమే ఆదేశాలిస్తాం..టీ సర్కారుకి హైకోర్ట్ ఆదేశం