Human Skeleton Inter College: ఓ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలో ఆస్థిపంజరం కలకలం రేపింది. పాడుబడిన గది నుంచి బయటపడిన అస్థిపంజరం 80 శాతం పైగా పాడైపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరీక్షల నిమిత్తం ఆస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.
ఈ ఘటన వారణాసిలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చోటు చేసుకుంది. కోవిడ్ 19 ప్రభావం ఉన్న సమయంలో ఆ ఇంటర్ కాలేజీని క్వారంటైన్ సెంటర్‌గా ఉపయోగించారని తెలుస్తోంది. అయితే ఆస్థి పంజరం లభ్యమైన బిల్డింగ్ మాత్రం కోవిడ్ సెంటర్‌లో భాగం కాదని పోలీసులు తెలిపారు.
క్యాంపస్ వెనుక భాగంలో ఉన్న పాడుబడిన గదిలో ఆస్థి పంజరం లభ్యమైందని.. ఇక ఆ గదిని గత కొన్నేళ్లుగా ఎవరూ వాడట్లేదని పోలీసులు వెల్లడించారు. బుధవారం నాడు కొంతమంది పనివాళ్లు క్యాంపెస్ వెనుక శుభ్రం చేస్తున్న సమయంలో ఆస్థిపంజరాన్ని గుర్తించారని వారణాసి డీఐజీ అమిత్ పాథక్ వెల్లడించారు. కాగా, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆస్థిపంజరానికి సంబంధించి పూర్తి వివరాలు స్పష్టమవుతాయని పోలిసులు తెలిపారు.
12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!