Home Guard Killed By Students: మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేయడంతో హోంగార్డు మృతిచెందాడు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. నంద్యాల పట్ణణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని శిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామానికి చెందిన కుమ్మరి రాజశేఖర్ (44) నంద్యాలలోని కేంద్ర గిడ్డంగుల సంస్థలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు ఇంటర్ విద్యార్థులు, మరో యువకుడు మద్యం తాగేందుకు కార్యాలయ ఆవరణలోకి వచ్చారు. వీరిని చూసి హోంగార్డు రాజశేఖర్.. లోపలికి ఎందుకొచ్చారంటూ ప్రశ్నించాడు. దీంతో నలుగురు యువకులు తమనే అడుగుతావా అంటూ హోంగార్డుతో ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు హోంగార్డును బలంగా నెట్టడంతో ఆయన తల గేటుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నలుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే.. అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజశేఖర్‌ను మరో హోంగార్డు రామ సుబ్బయ్య గమనించి.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే రాజశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: