ఆత్మహత్య చేసుకునేవారిలో యువకులే ఎక్కువ!

ఆత్మహత్య మహాపాపమని తెలిసీ కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..గత ఏడాది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఎక్కువ శాతం 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే కావడం విషాదం..

ఆత్మహత్య చేసుకునేవారిలో యువకులే ఎక్కువ!

Updated on: Sep 02, 2020 | 1:45 PM

ఆత్మహత్య మహాపాపమని తెలిసీ కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..గత ఏడాది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఎక్కువ శాతం 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే కావడం విషాదం.. దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 23.4 శాతం రోజూవారీ కూలీలే కావడం మరింత విషాదం.. నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించిన గణాంకాలు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి.. బలవన్మరణాలకు పాల్పడిన వారిలో 15.4 శాతం మంది గృహిణులు ఉన్నారట! ఇక సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ఉన్నవారు 11.6 శాతం మంది, నిరుద్యోగులు 10.1 శాతం మంది ఉన్నట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో చెప్పింది.

ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారని తెలిపింది.. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ వల్ల 32.4 శాతం మంది, అనారోగ్యసమస్యలతో 17.1 శాతం మంది బలవంతంగా లోకం విడిచి వెళ్లిపోతున్నారని నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది.. గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడినవారిలో అత్యధికులు మహారాష్ట్రకు చెందినవారేనట!18,916 మంది చావును కోరి తెచ్చుకున్నారట! 13,493 ఆత్మహత్యలతో తమిళనాడు సెకండ్‌ప్లేస్‌లో ఉందట! పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిరుడు తెలంగాణలో 7,675 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.. ఇందులో 2,858 మంది కూలీలే ఉన్నారు.. 499 మంది రైతులు ఉండటం గమనార్హం.. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే పోయిన ఏడాది 6,465 మంది ఆత్మహత్య చేసుకున్నారు..

చావు అనేది సమస్యలకి పరిష్కారం కాదు… చచ్చి ఏమీ సాధించలేం. బతుకుతో ధైర్యంగా పోరాడాలి. ఓటమి అంటే గెలుపుకి ముందుమజిలీ మాత్రమే! … ఇలాంటి రొటీన్‌ డైలాగులు కాకుండా సమస్యల మూలాలను వెతికి వాటిని పరిష్కరిస్తే ఇన్నేసి బలవన్మరణాలు ఉండవు..