Telangana: ఎరువుల లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. అస్సలు యవ్వారం తెలిస్తే వామ్మో అంటారు

|

Feb 02, 2022 | 3:55 PM

తెలంగాణలో గంజాయి వేట దూకుడుగా సాగుతోంది. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీస్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లు, ఎక్సైజ్‌ ఠాణా పరిధిలో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాయి.

Telangana: ఎరువుల లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. అస్సలు యవ్వారం తెలిస్తే వామ్మో అంటారు
Smuggling
Follow us on

Smuggling: ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నా… డ్రగ్స్‌(Drugs), గంజాయి(Cannabis )స్మగ్లర్లు బరితెగిస్తూనే ఉన్నారు.  రోజుకో కొత్త మార్గంలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులనే కంగుతినేలా చేస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని తరలించేందుకు చాలా క్రియేటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పటివరకు పండ్ల లోడు మాటున.. ఆహార పదార్థాల మాటున.. పాల వ్యాన్లు లోపల… ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రూపంలో గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన చాలామంది స్మగ్లర్స్.. పోలీసులకు చిక్కారు.  తాజాగా జనగామ జిల్లా(Jangaon District)లో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లింగాలఘనపురం మండలం ఆర్టీసీ కాలనీ జాతీయ రహదారి వద్ద గంజాయిని పట్టుకున్నారు. 2కోట్ల రూపాయలకు పైగా విలువైన 1800 కేజీల ఎండుగంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా నుండి వయా సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

రాత్రి 7గంటల నుండి ఏడున్నర గంటల సమయంలో పక్కా సమాచారం మేరకు వరంగల్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. జనగామ శివారు నెల్లుట్ల గ్రామం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. బైపాస్ వద్ద డిసియం వాహనాన్ని ఆపి చెక్ చేయగా వాహనంలో అత్యధిక శాతం బస్తాల్లో కంపోస్ట్ ఎరువుల బ్యాగులు కనిపించాయి.. వాటి మధ్యలోనే ఎండు గంజాయి బ్యాగులు బయటపడ్డాయి. వీటిని చుసిన అధికారులే నివ్వెరపోయారు. డీసీఎంలో 54 బస్తా సంచుల్లో కుక్కి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..సరుకు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్‌

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…