Thieves Gang: 300లపైగా కేసులున్న దొంగల ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌

|

Feb 06, 2021 | 9:06 AM

Thieves Gang: దొంగల ముఠాలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. పనిపాటా లేకుండా అడ్డదారులు తొక్కుతూ చోరీలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు రోజురోజుకు..

Thieves Gang: 300లపైగా కేసులున్న దొంగల ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌
Follow us on

Thieves Gang: దొంగల ముఠాలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. పనిపాటా లేకుండా అడ్డదారులు తొక్కుతూ చోరీలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా కరడుగట్టిన ముగ్గురు అంతర్‌రాష్ట్ర దొంగలను ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 300లకుపైగా కేసులు నమోదై ఉన్నాయని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌ నగరంలో ఉంటూ కూలిపని చేస్తున్న కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి నవీన్‌మెట్ల కాలనీకి చెందిన ఆరేపల్లి దుర్గారావు అలియస్‌ దుర్గా , ఓల్డ్‌ గుంటూరు జిల్లాకు చెందిన స్వర్ణకారుడు పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు అలియాస్‌ మహేష్‌. అలియాస్‌ బుజ్జి, అలాగే గుంటూరు ఏటీ అగ్రహారంకు చెందిన పెయింటింగ్‌ కార్మికుడు పైరాధ కిరణ్‌బాబు అలియాస్‌ కిరణ్‌లు స్నేహితులు. దొంగతనం చేయాలనుకున్నప్పుడు ఈ ముగ్గురు నగరానికి వచ్చి ధనిక వర్గాలు నివాసముండే కాలనీలే వీరి టార్గెట్‌. రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

అలాగే దుర్గారావు తాళం చెవిలేకుండానే తాళాలు తీయడంలో దిట్ట. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ ముగ్గురిని హబ్సిగూడలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 10 తులాల బంగారం నగలు, 4 కిలోల వెండి వస్తువులు, రూ.11,200 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరితో పాటు ఇంకెంత మంది దొంగలు ఉన్నారనేదానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ లో రాత్రి డ్రంకన్ డ్రైవ్, హోంమంత్రి మహమూద్ అలీ బంధువులమంటూ అమ్మాయిల హల్చల్