Five members of family murdered: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇనాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. రాత్రివేళ కుటుంబ సభ్యులు నిద్రిస్తున్నసమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. దంపతులతో పాటు ముగ్గురు పిల్లలను హత్యచేశాడు. కాగా.. భూ వివాదంలో మామ కుటుంబాన్ని అల్లుడు చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అంతకుముందు అల్లుడు పవన్.. మామ రమేష్ ఇంట్లోనే నివసించేవాడని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. మరణించిన వారిలో ఇద్దరు కుమారులతో సహా… కుమార్తె కూడా ఉంది.
చంపిన అనంతరం.. పవన్ పారిపోయాడు. గమనించిన గ్రామస్తులు రమేష్ ఇంటికి చేరుకుని పరిశీలించగా.. వారంతా రక్తపుముడుగులో పడివున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అయోధ్య ఎస్‌ఎస్‌పి శైలేష్ పాండే నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆస్తి వివాదం నేపథ్యంలోనే హత్య చేసినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పవన్‌ను అరెస్టు చేయడానికి ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఎస్‌పీ వెల్లడించారు.
Also Read: