Tirupati Fire Accident: తిరుపతిలో గ్యాస్‌ లీక్‌.. అపార్ట్‌మెంట్‌లో మంటలు.. భారీగా ఆస్తి నష్టం..!

Tirupati Fire Accident: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదశాత్తు గ్యాస్‌ లీకేజీ అయ్యింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో.

Tirupati Fire Accident: తిరుపతిలో గ్యాస్‌ లీక్‌.. అపార్ట్‌మెంట్‌లో మంటలు.. భారీగా ఆస్తి నష్టం..!

Updated on: Jul 25, 2021 | 11:17 PM

Tirupati Fire Accident: తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఆదివారం ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదశాత్తు గ్యాస్‌ లీకేజీ అయ్యింది. దీంతో అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 లక్షల రూపాయల వస్తువులు కాలిపోయినట్లు అపార్ట్‌మెంట్‌ యజమాని పేర్కొన్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అగ్ని మాపక శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అసిస్టెంట్‌ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ శ్యామ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన విషయమై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్లు భయాందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇవీ కూడా చదవండి

3000కోసం ప్రాణంతీశాడు.. తాకట్టుపెట్టిన సెల్‌ఫోన్‌ కోసం స్నేహితుడిని హతమార్చాడు..

Tadipatri: పక్కపక్కనే ఉన్న అన్నదమ్ముల ఇళ్లల్లో దొంగతనం… రంగంలోకి దిగిన పోలీసుల మైండ్ బ్లాంక్..