Love: ప్రేమించిందని దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు

Family members: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై

Love: ప్రేమించిందని దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుటుంబ సభ్యులు
burn

Updated on: Jun 16, 2021 | 7:57 AM

Family members: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే దారుణానికి ఒడికట్టారు. ఆ యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘోర సంఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులు కొంతకాలంగా యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అయితే.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు.. పెళ్లి విషయంపై యువతిని బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో వారి మధ్య గోడవ పెరగడంతో.. సోదరుడు, తల్లి, తండ్రి ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

యువతి ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగున్న వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే.. గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వద్దని వారిస్తున్నా.. అన్న తాజుద్దీన్ యువతిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడని యువతి తండ్రి తెలిపాడు. ఈ సంఘటన అనంతరం యువతి అన్న తాజుద్దీన్ పరారయ్యడు.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నగరాల్లో రేట్లు ఇలా..

NRIDA Recruitment: రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేశారా? మ‌రో రోండు రోజుల్లో..