Viral News: ఓ ఉన్నాది ఉరిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అతను చేసిన పని మరెవరు చేయకుండా, చూసే వారి వెన్నులో వణుకుపుట్టేలా ఉండాలని కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ ఉన్మాది ఎవరు.? అతను చేసిన నేరం ఏంటి.? వివరాల్లోకి వెళితే.. ఈజిప్టులో నైరా అష్రఫ్ (21) అనే ఓ యునివర్సిటీ విద్యార్థిని, మహ్మద్ అదాల్ అనే వ్యక్తి గత నెల 20వ తేదీన కత్తితో పొడిచి చంపాడు. నైరా అష్రఫ్ చదువుకుంటున్న యూనివర్సిటీలో అదాల్ ఆమెకు సీనియర్.. గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నైర వెంటపడ్డడ అదాల్.. ఆమె పెళ్లికి అంగీకరించకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు.
దీంతో అదాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. రెండు రోజుల పాటు విచారణ చేపట్టిన కోర్టు.. అదాల్ నేరం చేశాడని నిరూపితం కావడంతో మరణ శిక్ష విధించింది. నైరా హత్యకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అదాల్ బతికే హక్కు లేదంటూ తీర్పునిచ్చింది. అయితే భవిష్యత్తులో అమ్మాయిలను ఇంకెవరు ఇలా ఆట బొమ్మల్లా చూడకుండాలంటే, నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలంటే ఉన్మాది ఉరి తీతను టీచీ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇదిలో ఉంటే ఈజిప్ట్‌లో ఇలా మరణ శిక్షను ప్రతక్షప్రసారం చేయడం ఇదే తొలిసారి కాదు గతంలో 1998లో కైరోలో ఓ మహిళతో పాటు తన ఇద్దరు పిల్లలను ముగ్గురు ఉన్మాదులు అత్యంత దారుణంగా హత్య చేశారు. సదరు వ్యక్తుల ఉరితీతను అప్పట్లో ప్రతక్ష్య ప్రసారం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..