Fake DSP: ఫేక్ పోటుగాడు : డీఎస్పీ డ్రెస్‌లో బిల్డప్ ఇచ్చి.. ఎన్ని యవ్వారాలు చక్కబెట్టాడంటే..!

| Edited By: Janardhan Veluru

Jul 17, 2021 | 10:06 AM

Telangana Crime News: కామారెడ్డి జిల్లాలో ఒక ఫేక్ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది. బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి..

Fake DSP: ఫేక్ పోటుగాడు : డీఎస్పీ డ్రెస్‌లో బిల్డప్ ఇచ్చి.. ఎన్ని యవ్వారాలు చక్కబెట్టాడంటే..!
Fake Dsp
Follow us on

Fake Police: కామారెడ్డి జిల్లాలో ఒక ఫేక్ డీఎస్పీ బాగోతం బట్టబయలైంది. బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ డ్రెస్ లో వెహికల్ లో తిరుగుతూ అక్రమాలకు పాల్పడుతోన్న స్వామి అనే నకిలీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 5 జిల్లాల్లో 20 మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట కోటి రూపాయలు ఈ నకిలీ డీఎస్పీ నెల్లూరు స్వామి వసూలు చేసినట్టు పోలీసులు నిగ్గు తేల్చారు. అంతేకాదు, డీఎస్పీ డ్రెస్ లో వాహనంలో ప్రయాణిస్తూ ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం, సెటిల్మెంట్ చేయడం స్వామి చేసేవాడు.

ఇంటర్మీడియేట్ పాస్ కానీ వ్యక్తి డీఎస్పీ కావడమేంటని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కొందరు బాధితులు ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫలితం.. ఇందాకా పెద్ద పోలీసాఫీసర్ గా బిల్డప్ కొట్టిన నకిలీ డీఎస్పీ నెల్లూరు స్వామి.. కటకటాలవెనక్కి వెళ్లి ఊచలు లెక్కపెడుతున్నాడిప్పుడు.

Read also: Warning: యమ డేంజర్ : ఉపద్రవం ఎంతో దూరం లేదు .. దశ ఆల్రెడీ స్టార్టైపోయిందట. బి కేర్ ఫుల్.!