కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు.. అసలేం జరిగిందంటే?

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఒక ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ధులే పరిధిలోని తాపీ నదిలో కాళ్లకు ఇనుప గొలుసు కట్టి, తాళం వేసిన స్థితిలో యువకుడు, యువతి మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కాళ్లకు ఇనుప గొలుసులు, తాళం.. నదిలో ప్రత్యక్షమైన నవదంపతుల శవాలు.. అసలేం జరిగిందంటే?
Tapi River Chained Couple Found Dead

Edited By:

Updated on: Oct 10, 2026 | 9:30 PM

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఒక ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వారి కాళ్లకు గోలుసుతో కట్టి మరీ.. దాని తాళం వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నదిలో మృతదేమాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారంతో మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను వీరు అమళ్‌నేర్ తాలూకాకు చెందినవారు శ్యామ్ హరి పాటిల్ (28), స్వప్న పాటిల్ (20)గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఎరండోల్ తాలూకాలోని ఉత్రన్ ప్రాంతంలో నివసిస్తున్నారని.. ప్రాథమిక విచారణలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు తేలింది. అయితే మృతదేహాల కాళ్లను ఇనుప గొలుసుతో కలిపి కట్టి, తాళం వేసి ఉండటం ఈ మరణాలపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి నదిలో పడేశారా అనే కోణంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

సమాచారం అందుకున్న వెంటనే నర్డాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నది నుంచి వెలికితీశారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, సవాల్డే-తాపీ వంతెన వద్ద ఇలాంటి అనుమానాస్పద ఘటనలు పెరుగుతుండటంతో అధికారులు తక్షణమే పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us