మీ జేబులో డబ్బు ఉంటే.. మీరు ఢిల్లీ వీధుల్లో నడుస్తుంటే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు దేశ రాజధానిలో వినూత్న పద్దతిలో మీ జేబు కొల్లగొట్టే ముఠా ఒకటి సంచరిస్తుంది. ఈ ముఠా దోపిడీకి ఏ ఆయుధాన్ని ఉపయోగించదు. వానరమే వారి అస్త్రం. ఈ దొంగలు కోతులకు ట్రైనింగ్ ఇచ్చి.. ప్రజలను చుట్టుముట్టి, వారి జేబుల్లో నుంచి డబ్బును మాయచేసి దోచేస్తారు. తాజాగా ఈ కోతుల దోపిడీ ముఠాలోని ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మాల్వియా నగర్‌లో నిందితులు ఒక కోతిని మహిళపైకి వదిలి, ఆమె నుంచి రూ. 6000 ను దోచుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు, ఒక న్యాయవాదిని బాధితురాలిగా కనుగొన్నారు. కోతి సాయంతో తన వద్ద ఉన్న డబ్బును లాగేసుకున్నారని ఆమె వెల్లడించారు. దీంతో అలర్టైన పోలీసులు… నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న అన్ని సీసీ టీటీ పుటేజీలను చెక్ చేశారు..
ఎట్టకేలకు పోలీసులు నిందితులైన బల్వాన్ నాథ్, విక్రమ్ నాథ్ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిద్దరినీ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ తమ మూడవ పార్టనర్‌తో కలిసి కోతి కరుస్తుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. దోపిడీలకు తెగబడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న రెండు కోతులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రస్తుతం వన్యప్రాణి విభాగానికి అప్పగించారు. పరారీలో ఉన్న వారి మూడవ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్…రైల్వే సేవలు రద్దు చేస్తారా? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ