Noida Crime: 100 గజాల స్థలం కోసం 10 ఏళ్ళ నుంచి చల్లారని పగ.. ఇప్పటివరకు 5 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పట్టపగలు కాల్పుల ఘటన కలకలం రేపింది. నోయిడా సెక్టార్ 104లోని జిమ్ వెలుపల ఎయిర్ ఇండియా ఉద్యోగిని కాల్చి చంపారు దుండగులు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని హత్య సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Noida Crime: 100 గజాల స్థలం కోసం 10 ఏళ్ళ నుంచి చల్లారని పగ.. ఇప్పటివరకు 5 మంది మృతి
Murder

Updated on: Jan 21, 2024 | 8:55 PM

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పట్టపగలు కాల్పుల ఘటన కలకలం రేపింది. నోయిడా సెక్టార్ 104లోని జిమ్ వెలుపల ఎయిర్ ఇండియా ఉద్యోగిని కాల్చి చంపారు దుండగులు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని హత్య సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ పర్వేష్ మాన్ సోదరుడు సూరజ్ మాన్ ఎనీటైమ్ ఫిట్‌నెస్ జిమ్ వెలుపల తన కారులో అరటిపండు తింటుండగా, బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అతనిపైకి సుమారు 10 బుల్లెట్లు కాల్చారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వారిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రవేశ్, సూరజ్ మాన్‌లుగా గుర్తించారు. పరారీలో ఉన్న ధీరజ్, అరుణ్ మాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఢిల్లీలోని ఖేదా ఖుర్ద్ గ్రామంలో 100 గజాల స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య 10 ఏళ్ల నాటి శత్రుత్వం ఉంది. ఈ కారణంగా సూరజ్ మాన్ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పరస్పర పోటీతో రెండు ముఠాలు పుట్టుకొచ్చాయి. ఒక ముఠాకు ప్రవేశ్‌ నాయకత్వం వహిస్తుండగా, మరొకటి కపిల్‌ మాన్‌. ఇప్పటి వరకు ఇరు కుటుంబాల మధ్య ఐదు హత్యలు జరిగాయి. తాజాగా జనవరి 19న సూరజ్ మాన్ హత్యకు గురయ్యారు.

సూరజ్ మాన్ హత్య కేసుపై, DCP హర్ష్ చందర్ మాట్లాడుతూ, ప్రవేశ్, కపిల్ ఇద్దరూ అనేక హత్యలు, దోపిడీ కేసులలో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారని చెప్పారు. ప్రవేష్‌పై గ్యాంగ్‌స్టర్ యాక్ట్, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సూరజ్ కుటుంబం తమ ఫిర్యాదులో తమ గ్రామానికి చెందిన కొందరి పేర్లను పేర్కొంది. సూరజ్ కజిన్ రోమిత్ మాన్ ప్రత్యర్థి కుటుంబానికి చెందిన ధీరజ్ మాన్, శక్తి మాన్, సంజీత్ మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 302, 34, 427 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇదిలావుంటే తాజా ఘటనలో కపిల్ మాన్ గ్యాంగ్ ప్లాన్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ హర్ష్ చందర్ తెలిపారు. దీనిపై విచారణ చేసేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం చుట్టూ ఉన్న 200 కెమెరాల ఫుటేజీని స్కాన్ చేస్తున్నారు.

ధీరజ్ కపిల్ సోదరుడని డీసీపీ తెలిపారు. అరుణ్ సోదరుడిపై ఇటీవల పర్వేష్ గ్యాంగ్ సభ్యుడు దాడి చేశాడు. షహబాద్ డెయిరీ దగ్గర ధీరజ్‌ని అరెస్టు చేశారు. అరుణ్‌ను ఢిల్లీలోని నరేలా నుంచి తీసుకెళ్లారు. వీరిద్దరూ కలిసి హత్యకు పథకం వేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి పిస్టల్, కంట్రీ మేడ్ గన్, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. బైక్‌పై వచ్చిన ముష్కరులను గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అలాగే కపిల్ తన కుటుంబంలో జరిగిన మరణాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా కాలంగా ఈ హత్యకు ప్లాన్ చేస్తున్నాడని ధీరజ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కాగా, సూరజ్ దినచర్య గురించి ఆలోచించేందుకు షూటర్లు గత ఆరు నుంచి ఏడు నెలలుగా అతడిని అనుసరిస్తున్నారని అదనపు డీసీపీ మనీష్ మిశ్రా తెలిపారు. వారు అతని కారు నంబర్, అతను పని కోసం, జిమ్‌కు వెళ్లడానికి ఇంటి నుండి బయలుదేరిన సమయాన్ని గమనించి దాడి చేశారు.

2010లో ఖేదా ఖుర్ద్‌ గ్రామంలో ఓ ప్లాట్‌ విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ప్రవేశ్‌, కపిల్‌ కుటుంబాల మధ్య శత్రుత్వం మొదలైనట్లు ఏసీపీ రజనీష్‌ వర్మ తెలిపారు. 100 గజాల స్థలం తమదేనని ఇరు కుటుంబాలు వాదిస్తున్నాయి. అప్పటి నుంచి ఇరు కుటుంబాల సభ్యులు పలుమార్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగు హత్యలు జరిగాయి. రెండు కుటుంబాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే భూవివాదానికి సంబంధించి సూరజ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇది ఐదో హత్య.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…