షాకింగ్‌.. శవమై తేలిన ఎమ్మెల్యే పీఎస్ఓ.. హత్యా..? ఆత్మహత్యా..?

ఒడిషాలో దారుణం చోటుచేసుకుంది. సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మన్‌ ముందా వ్యక్తిగత భద్రతాధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

షాకింగ్‌.. శవమై తేలిన ఎమ్మెల్యే పీఎస్ఓ.. హత్యా..? ఆత్మహత్యా..?

Updated on: Jun 18, 2020 | 6:07 PM

ఒడిషాలో దారుణం చోటుచేసుకుంది. సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే లక్ష్మన్‌ ముందా వ్యక్తిగత భద్రతాధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాష్ట్రంలోని సుందర్‌ఘర్‌ జిల్లా కుర్దా గ్రామంలోని ఆయన నివాసంలో గురువారం ఉదయం శవమై తేలారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు దమ్బరుదర్ సాహూ అని గుర్తించారు. మృతుడి శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని.. తన వ్యక్తిగత రివాల్వర్‌ నుంచే ఈ బుల్లెట్ పేలిందని పోలీసులు గుర్తించారు. అయితే మృతుడు తన వ్యక్తిగత రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేదా..
ఎవరైనా హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా..? అన్నది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us