కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేక భార్య మృతి

తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అత్తింటి వేధింపులు తట్టుకోలేక.. పుట్టింటికి వెళ్లలేక ఎంతోమంది మహిళలు బలవుతున్నారు. ఉద్యోగం చేసే వారైనా.. ఇంట్లో ఉండే వారైనా.. వరకట్న వేధింపులకు గురవుతున్నారు. మెదక్ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ బండి శ్యాంకుమార్ కొద్ది రోజుల క్రితం రెండవ […]

కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేక భార్య మృతి

Updated on: Jun 25, 2019 | 12:10 PM

తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అత్తింటి వేధింపులు తట్టుకోలేక.. పుట్టింటికి వెళ్లలేక ఎంతోమంది మహిళలు బలవుతున్నారు. ఉద్యోగం చేసే వారైనా.. ఇంట్లో ఉండే వారైనా.. వరకట్న వేధింపులకు గురవుతున్నారు. మెదక్ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ బండి శ్యాంకుమార్ కొద్ది రోజుల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఇక మొదటి భార్య లహరిని వరకట్న వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి 10 లక్షల రూపాయలు తేవాలని డిమాండ్ చేశాడు. అతడు అడిగిన డబ్బులు తీసుకురాలేక.. భర్త వేధింపులు తట్టుకోలేక లహరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లహరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెదక్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us