హాథ్రాస్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఘటన జరిగి మూడు నెలలు గడిచిన తరువాత అసలు విషయం తేలింది. బాధితురాలి తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలే నిజమని ఎట్టకేలకు తేలాయి. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన దళిత యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీబీఐ తేల్చింది. ఆ మేరకు నిందితులైన లవకుశ్, రాము, సందీప్, రవిపై అత్యాచారం, హత్య అభియోగాలను మోపుతూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన దళిత యువతిపై ఈ నలుగురు నిందితులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతిని తీవ్రంగా గాయపరిచారు. దాంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధిత యువతిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు పెల్లుబుకాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పోలీసులు బాధిత యువతి మృతదేహానికి గట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి దాటిని తరువాత.. యువతి కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలు చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెలుబుకాయి. దీంతో యోగి సర్కార్ ఈ ఘటనపై విచారణకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి. మూడు నెలలపాటు విచారణ చేపట్టిన సీబీఐ ఎట్టకేలకు అత్యాచారం నిజమే అని తేల్చింది.
Also read: