Shilpa Shetty-Raj Kundra: మరో వివాదం.. శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు

బాలీవుడ్‌ కపుల్‌ రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ బిజినెస్‌మెన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కపుల్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.

Shilpa Shetty-Raj Kundra: మరో వివాదం.. శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు
Raj Kundra, Shilpa Shetty

Updated on: Nov 14, 2021 | 12:51 PM

బాలీవుడ్‌ కపుల్‌ రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ బిజినెస్‌మెన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కపుల్‌పై చీటింగ్‌, ఫోర్జరీ కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ప్రారంభించిన ఫిట్‌నెస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి కోటీ 51లక్షల రూపాయలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదిరించారని ఆరోపిస్తున్నాడు ఆ బిజినెస్ మ్యాన్‌. వ్యాపారవేత్త నితిన్ బరాయ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జూలై 2014లో, ఎస్‌ఎఫ్‌ఎల్ ఫిట్‌నెస్ కంపెనీ డైరెక్టర్ కాషిఫ్ ఖాన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాతో పాటు ఇతరులు సంస్థలో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని తనను కోరినట్లు ఫిర్యాదుదారు తెలిపాడు. SFL ఫిట్‌నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీని కేటాయిస్తుందని.. అంతేకాకుండా పొరుగున ఉన్న పూణేలోని హడప్సర్,  కోరేగావ్‌లలో జిమ్, స్పాను తెరుస్తుందని తనకు హామీ ఇచ్చారని ఫిర్యాదుదారు తెలిపాడు. అయితే డబ్బు ఇచ్చినప్పటికీ, వారి ప్రపోజల్ కార్యరూపం దాల్చలేదని వెల్లడించాడు. దీంతో తన డబ్బును ఇవ్వాలని కోరితే, బెదిరింపులకు పాల్పడుతున్నారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు ఆధారంగా, బాంద్రా పోలీసులు సెక్షన్ 420, సెక్షన్  120-బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 34 సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

పోర్నోగ్రఫీ కేసులో జులైలో అరెస్టైన రాజ్‌కుంద్రా..సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ ఇంతలోనే ఈ దంపతులపై చీటింగ్‌ కేసు నమోదవడం సంచలనంగా మారింది.

Also Read: Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్..

Loading...
Unable to load recommendations.
Follow Us