AP Crime: గుంటూరులో దారుణం.. నడి రోడ్డుపై విద్యార్థిని హత్య.. కత్తితో కిరాతకంగా..

Btech student muder: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కాకాని రోడ్డులో బీటెక్‌ విద్యార్థిని

AP Crime: గుంటూరులో దారుణం.. నడి రోడ్డుపై విద్యార్థిని హత్య.. కత్తితో కిరాతకంగా..

Updated on: Aug 15, 2021 | 12:09 PM

Btech student muder: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కాకాని రోడ్డులో బీటెక్‌ విద్యార్థినినీ దారుణ హత్యకు గురైంది. ఓ యువతిని గుర్తు తెలియని ఆగంతకుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కాకాని రోడ్డులోని పరామయకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడు.. యువతిపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు… మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన యువతి ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్నట్లుగా గుర్తించారు. కాగా.. విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు. నిందితుడి కోసం పోలీసులు నగరంలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Crime News: దశదిన కర్మకు వెళ్లి ముగ్గురు మృతి.. మద్యం తాగి కుప్పకూలిన బాధితులు.. అసలేమైందంటే..?

అస్సాం-మిజోరాం మధ్య మళ్ళీ ఉద్రిక్తత ..? సరిహద్దుల్లో బాంబు పేలుడు.. స్కూలు ధ్వంసం