ఆదిలాబాద్ జిల్లాలో నాటు పడవ బోల్తా…

ఆదిలాబాద్ జిల్లా పెనుగంగాలో నాటు పడవ బోల్తా పడింది. బీర్పూర్ మండలం అంతర్గాం సమీపంలోని పెనుగంగలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నది ఒడ్డుకు సమీపంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది గమనించిన స్థానికులు నాటు పడవలో ప్రయాణిస్తున్న అందరినీ సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. నాటు పడవలో పరమితికి మించి ప్రయాణికులు ఉండటంతో అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పది మంది ప్రయాణికులు ఉండగా… అందులో […]

ఆదిలాబాద్ జిల్లాలో నాటు పడవ బోల్తా...

Updated on: Jun 20, 2020 | 5:30 PM

ఆదిలాబాద్ జిల్లా పెనుగంగాలో నాటు పడవ బోల్తా పడింది. బీర్పూర్ మండలం అంతర్గాం సమీపంలోని పెనుగంగలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నది ఒడ్డుకు సమీపంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది గమనించిన స్థానికులు నాటు పడవలో ప్రయాణిస్తున్న అందరినీ సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు.

నాటు పడవలో పరమితికి మించి ప్రయాణికులు ఉండటంతో అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో పది మంది ప్రయాణికులు ఉండగా… అందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఈ నాటు పడవ ప్రమాదం తర్వాత కూడా పడవ ప్రయాణాలు ఆగలేదు. ప్రమాదానికి గురైన పడవలోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us