Gang War: బెంగళూరు హిజ్రాలు Vs రాయలసీమ హిజ్రాలు.. సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్

అనంతపురంలో  హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ టెన్షన్ రేపుతోంది. వ్యవహారం సినిమా రేంజ్‌లో ట్విస్టులను తలపిస్తుంది. 

Gang War: బెంగళూరు హిజ్రాలు Vs రాయలసీమ హిజ్రాలు.. సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్
Hijras Gang War

Updated on: Jul 29, 2021 | 10:37 AM

అనంతపురంలో  హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ టెన్షన్ రేపుతోంది. వ్యవహారం సినిమా రేంజ్‌లో ట్విస్టులను తలపిస్తుంది.  బెంగళూరు వర్సెస్ రాయలసీమ గ్యాంగుల మధ్య ఈ వార్ సాగుతుంది.  అనంతపురం కేంద్రంగా రాయలసీమ హిజ్రాల సంఘం ఇటీవల ఆషాడ మాసం పండుగ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి బెంగళూరు హిజ్రాల సంఘం నుంచి పలువురు హాజరయ్యారు. అయితే రాయలసీమ బ్యాచ్ ఐక్యంగా, అన్యోన్యంగా ఉండటం చూసి.. వారిని ఆందోళనకు గురిచెయ్యాలని… అందులో ఒకరిని బెంగళూరు గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.  దీనికి ప్రతిగా బెంగళూరు గ్యాంగ్ నుంచి కూడా ఒకరిని రాయలసీమ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. ఈ వార్ కాస్తా పీక్స్‌కు వెళ్లింది. రాయలసీమ బ్యాచ్‌కు చెందిన ఒకరిపై అటాక్ చేసిన బెంగళూరు గ్యాంగ్ నగలు, డబ్బుతో ఉడాయించింది. దీంతో ప్రస్టేజ్‌గా తీసుకున్న రాయలసీమ బ్యాచ్ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్దమైంది. మా వైపు వాళ్లను వదిలితే, మీ వైపు వాళ్లను వదులుతామంటూ ఇరు వర్గాలు పరస్పరం డీల్ కుదుర్చునేందుకు మంతనాలు జరుపుతున్నాయి. వీరి వ్వవహారం శృతి మించడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడులు, ప్రతి దాడులకు దిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆది, గురు వారాలు వచ్చాయంటే వణుకే

పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థి హత్య కేసులో ఊహించని కోణం.. స్వలింగ సంపర్కమే కారణం

Follow Us