Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..

వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితమంతా కలిసి  కష్ట సుఖాలను పంచుకోవాలనుకున్నారు.  కానీ చాలా ప్రేమకథ(Love Story) ల్లోలాగే వారి ప్రేమకు అడ్డు తగిలారు. ఇద్దరినీ విడదీశారు.  అంతే ప్రేమ ఎడబాటును తట్టుకోలేని ఆ ప్రేమికులు ఉరితాడే మేలనుకున్నారు

Kurnool: కర్నూలు జిల్లాలో విషాదం.. ప్రేమకు అడ్డు చెప్పిన పెద్దలు.. ఎడబాటుతో ప్రేమికుల బలవన్మరణం..
Suicide

Updated on: Jan 30, 2022 | 8:48 AM

వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితమంతా కలిసి  కష్ట సుఖాలను పంచుకోవాలనుకున్నారు.  కానీ చాలా ప్రేమకథ(Love Story) ల్లోలాగే వారి ప్రేమకు అడ్డు తగిలారు. ఇద్దరినీ విడదీశారు.  అంతే ప్రేమ ఎడబాటును తట్టుకోలేని ఆ ప్రేమికులు ఉరితాడే మేలనుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు (Kurnool) జిల్లాలోని ఆలూరు(Alur) లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఆలూరుకు చెందిన విజయ్ ఐటీఐ చదువుతున్నాడు. అతను ఆలూరుకే చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు మనసులు కలవడంతో కలిసి జీవించాలనుకున్నారు.

అయితే  పెద్దలకు వీరి ప్రేమ విషయం తెలియడంతో ఇద్దరినీ దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే ప్రియురాలిని దూరంగా ఉంచారనే మనస్తాపంతో విజయ్ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా  ప్రియుడి  మరణ వార్తను విన్న బీటెక్ విద్యార్థిని ఆ విషాదాన్ని తట్టుకోలేకపోయింది. అతను లేని లోకంలో తానుండలేనంటూ తాను కూడా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.  కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై ఇరు కుటుంబాల పెద్దలను ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also read: Ira Khan: ముసలిదైపోయింది అంటూ ఆమీర్ ఖాన్ కూతురిని దారుణంగా దూషించిన నెటిజన్.. హిత బోధ చేసిన ప్రముఖ సింగర్..

Pushpa: క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోన్న ‘పుష్ప’ ఫీవర్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును అశ్విన్ ఎలా అనుకరించాడో మీరే చూడండి..

Megastar Chiranjeevi: క్వారంటైన్ లో కెమెరాకు పని చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. కవిత్వం కూడా అల్లేశారు..