Inspector Suspended: పట్టుకున్న సొమ్ముతో పరార్.. కర్నూలు సీఐపై రాముడుపై సస్పెన్షన్ వేటు..

|

Mar 26, 2022 | 7:51 AM

పేరుకు పెద్ద హోదా.. తన మాటే శాసనం అనుకున్నాడేమో.. అవినీతికి తెరలేపాడు. ఇందుకోసం స్వయంగా జిల్లా పోలీసు సూపరిండెంట్‌ పేరునే వాడుసుకున్నాడు.

Inspector Suspended: పట్టుకున్న సొమ్ముతో పరార్.. కర్నూలు సీఐపై రాముడుపై సస్పెన్షన్ వేటు..
Ci Suspended
Follow us on

Kurnool Inspector Suspension: కర్నూలు జిల్లా అర్బన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కంబగిరి రాముడు(Kambagiri Ramudu)పై సస్పెన్షన్ వేటు పడింది. పేరుకు పెద్ద హోదా.. తన మాటే శాసనం అనుకున్నాడేమో.. అవినీతికి తెరలేపాడు. ఇందుకోసం స్వయంగా జిల్లా పోలీసు సూపరిండెంట్‌(Superintendent of Police) పేరునే వాడుసుకున్నాడు. అయితే సదరు అధికారి వ్యవహారం బట్టబయలైంది. దీంతో అతన్ని విధుల నుంచి తప్పిస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన డ్యూటీ చేసిన పోలీసు స్టేషన్ లోనే కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. దీంతో పరారీలో ఉన్న సీఐని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు కేసుతో సంబంధం ఉన్న సీఐ కి మీడియేటర్‌గా వ్యవహరించిన ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

ఈ నెల 19న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ బస్సులో ప్రయాణిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద రూ.75 లక్షలను గుర్తించారు. డబ్బుతో పాటు ఆ వ్యక్తిని కర్నూల్ అర్బన్ పోలీసులకు అప్పగించారు సెబ్ అధికారులు. అయితే, డబ్బుకు సంబంధించిన పత్రాలను చూపించాడు బాలకృష్ణ. అయితే సీఐ కంబగిరి రాముడు పట్టుబడిన మొత్తం సోమ్ము ఇవ్వకుండా రూ. 15 లక్షలను తీసుకున్నాడు. ఈ డబ్బులను జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ బకాయించాడు సీఐ రాముడు. ఇందులో రూ. 5 లక్షలను ముగ్గురు మధ్యవర్తులు ఇచ్చాడు. మిగిలిన రూ.10 లక్షలు తన వద్ద ఉంచుకుని మిగతా డబ్బులు రూ.60లక్షలు.. బాలకృష్ణకు అప్పగించాడు.

సీఐ రాముడు వ్యవహరాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు బాధితుడు బాలకృష్ణ. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి… సీఐ పని చేస్తున్న స్టేషన్ లోనే కేసు నమోదు చేయించారు. కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు ఇచ్చారు. సీఐతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదైంది. విషయంలో బయటపడటంతో సదరు సీఐ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇక మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈక్రమంలోనే సీఐ రాములుపై సస్పెన్షన్ వేటు పడింది.

Read Also… Lord Shiva in Court: ప్రభుత్వభూమి కబ్జా కేసులలో విచారణకు హాజరైన “పరమశివుడు”..!