Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో హీరోయిన్ అరెస్ట్

Shanaya Katwe : ప్రియుడి మోజులో పడి రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడ్నే అంతమొందించిన కన్నడ హీరోయిన్ అరెస్ట్ అయింది. కన్నడ సినీనటి షనాయా కాట్వేను కర్నాటక పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

Shanaya Katwe : మేనేజర్ తో కామకేళి.. అడ్డొస్తున్నాడని  సొంత తమ్ముడ్నే హతమార్చిన కేసులో  హీరోయిన్ అరెస్ట్
Actress Shanaya Katwe

Edited By:

Updated on: Apr 23, 2021 | 6:47 PM

Shanaya Katwe arrest : ప్రియుడి మోజులో పడి రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముడ్నే అంతమొందించిన కన్నడ హీరోయిన్ అరెస్ట్ అయింది. కన్నడ సినీనటి షనాయా కాట్వేను కర్నాటక పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే, షనాయా కాట్వే గత కొంతకాలంగా సినీ తారల మేనేజర్ నియాజ్ అహ్మద్ తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే షనాయా లవ్ అఫైర్ ను ఆమె సోదరుడు రాకేష్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, నియాజ్ అహ్మద్ కు దూరంగా ఉండాలని కూడా ఆమె తమ్ముడు కొంతకాలంగా సూచిస్తూ వస్తున్నాడు. అయితే, అప్పటికే ప్రియుడి మోజులో పీకల్లోకి మునిగిపోయిన షనాయా ఈ విషయాన్ని తన ప్రియుడు నియాజ్ కు చెప్పింది. దీంతో తనకు ఇది ఎంతో నష్టం కలిగిస్తుందని భావించిన ప్రియుడు నియాజ్.. రాకేష్ ను చంపేందుకు పథక రచన చేశాడు. నియాజ్, అతడి స్నేహితులు … రాకేష్ ను చంపి, డెడ్ బాడీని కారులో దాచిపెట్టారు. తర్వాత రాకేశ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి హుబ్బళ్లి పరిసర ప్రాంతాల్లో వేరు వేరు చోట్ల పడేశారు. రాకేష్ మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని హుబ్లీలో అదుపులోకి తీసుకున్నారు. కాగా షనాయా శాండిల్ వుడ్ లో వర్థమాన నటి. ‘ఒందు గంటేయ కథ’, ‘ఇదం ప్రేమమ్ జీవనమ్’ వంటి సినిమాల్లో నటించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood: కరోనాతో బాధపడుతున్న యువతిని నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన ‘రియల్ హీరో సోనూసూద్‌’

‘సైడ్ షో నాకు ఇష్టం లేదు’ అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు కేసునుంచి తప్పుకున్న సీనియర్ లాయర్ హరీష్ సాల్వే

Loading...
Unable to load recommendations.
Follow Us