మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో.. ఉదయం నుంచే సోదాలు చేస్తోంది...

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

Updated on: Sep 23, 2020 | 11:54 AM

మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో.. ఉదయం నుంచే సోదాలు చేస్తోంది. నర్సింహారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌లో 20 చోట్ల, వరంగల్‌ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్‌ సీఐగా పని చేశారు. ఆ సమయంలో పలు ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, భూ వివాదాల్లో తలదూర్చినట్లు నర్సింహారెడ్డిపై ఆరోపణలున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us