దొంగతనానికి వచ్చి బావిలో శవమయ్యాడు..!

దొంగతనం చేసేందుకు వచ్చి స్ధానికులు తరమడంతో ఓ దొంగ బావిలో పడి మృతి చెందాడు. ఒకరు పారిపోగా, మరొకడు గ్రామస్తులకు చిక్కాడు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.

దొంగతనానికి వచ్చి బావిలో శవమయ్యాడు..!

Updated on: Jul 12, 2020 | 1:52 PM

దొంగతనం చేసేందుకు వచ్చి స్ధానికులు తరమడంతో ఓ దొంగ బావిలో పడి మృతి చెందాడు. ఒకరు పారిపోగా, మరొకడు గ్రామస్తులకు చిక్కాడు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ ఇళ్లలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి వచ్చారు. కొత్తగా కనిపించే సరికి వారిని స్థానికులు నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి గ్రామస్తులు ముగ్గురిలో ఒకరిని పట్టుకోవడంతో మిగిలిన ఇద్దరు పారిపోయేందుకు యత్నించారు. ఇదే క్రమంలో తప్పించుకొని పారిపోతుండగా జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో పడి ఒకడు మృతి చెందాడు. గ్రామస్తులు పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. బావిలో పడ్డ యువకుడి మృతదేహాన్ని బయటికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, సెటాప్ బాక్సుల చోరీ కోసం వచ్చి తప్పించుకు పారిపోయే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.