Jammu And Kashmir: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం…

| Edited By:

Jan 29, 2021 | 8:57 PM

జమ్ముక‌శ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. అవంతిపోరలోని...

Jammu And Kashmir: జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌... భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం...
Follow us on

జమ్ముక‌శ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్ర‌వాద సంస్థ‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. అవంతిపోరలోని మందూరా ట్రాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మందూరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిందని కశ్మీర్‌ ఐజీ తెలిపారు. దీంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ కలిసి ఆ ప్రాంతాన్ని శుక్రవారం చుట్టుముట్టార‌ని వివ‌రించారు. లొంగిపోవాలని ఉగ్రవాదులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, భద్రతా సిబ్బందిపైకి వారు గ్రెనైడ్లు విసరడంతో ఇరువైపులా ఎదురుకాల్పులు జరిగాయని, ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ప్ర‌క‌టించారు. కాగా… ఇంకా ఉగ్ర‌వాదుల ఏరివేత ప్ర‌క్రియ కొనసాగుతోందని కశ్మీర్‌ ఐజీ తెలిపారు.