Arrested Chinese National : 1300 భారతీయ సిమ్‌ కార్డులు చైనాకు..! సరిహద్దు వద్ద ఆ దేశ పౌరుడి అరెస్ట్‌తో వెలుగుచూసిన నిజాలు..

|

Jun 11, 2021 | 8:50 PM

Arrested Chinese National : గడిచిన రెండేళ్లలో 1300 ఇండియన్ సిమ్‌లు చైనాకు చేరవేయబడ్డాయి. చైనా జాతీయుడి అరెస్ట్‌తో

Arrested Chinese National : 1300 భారతీయ సిమ్‌ కార్డులు చైనాకు..! సరిహద్దు వద్ద ఆ దేశ పౌరుడి అరెస్ట్‌తో వెలుగుచూసిన నిజాలు..
Arrested Chinese National
Follow us on

Arrested Chinese National : గడిచిన రెండేళ్లలో 1300 ఇండియన్ సిమ్‌లు చైనాకు చేరవేయబడ్డాయి. చైనా జాతీయుడి అరెస్ట్‌తో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. ప‌శ్చిమ బెంగాల్ మాల్డా జిల్లాలోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న చైనా జాతీయుడ్ని బీఎస్ఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం విచారించగా హుబ్లీలో నివాసం ఉంటున్న హాన్ జున్వేగా గుర్తించారు. అతడి దగ్గరి నుంచి లాప్‌టాప్‌, రెండు ఐఫోన్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, బంగ్లాదేశ్ సిమ్ కార్డు, ఏటీఎం కార్డులు, అమెరికా, ఇండియ‌న్‌, బంగ్లాదేశ్ దేశాల‌కు చెందిన క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2010 నుంచి నాలుగు సార్లు భార‌త్‌కు వ‌చ్చాన‌ని, గురుగ్రామ్‌లో స్టార్ స్ప్రింగ్‌ పేరుతో సొంత హోట‌ల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, అత‌డు చెప్పిన వివ‌రాల‌పై అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

గ‌తంలో చైనా జాతీయుడు జియాంగ్‌ను అరెస్టు చేసినప్పుడు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి జున్వే, అత‌డి భార్య పేర్లను ప్రస్తావనకు వచ్చాయి. దీంతో జున్వే, అతడి భార్యపై ల‌క్నోలో ఏటీఎస్ కేసు నమోదు చేసింద‌ని వివ‌రించారు. ఫ‌లితంగా జున్వే భారతీయ వీసా పొందలేక‌పోయాడ‌ని దీంతో నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వీసా సంపాదించిన అత‌డు గురువారం దేశంలోకి ప్రవేశించడంతో అరెస్ట్ చేసిన‌ట్లు బీఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. చైనా జాతీయుడైన జున్వే ఏదైనా నిఘా సంస్థ త‌రుఫున ప‌ని చేస్తున్నాడా అన్నదానిపై ద‌ర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Vaccine Booking With PAYTM : త్వరలో PAYTM తో కొవిడ్ వ్యాక్సిన్ బుకింగ్..! ఇక సులువుగా స్లాట్లు.. ఎలాగో తెలుసుకోండి..?

Rashi Khanna: డిజిట‌ల్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తోన్న రాశీఖ‌న్నా.. వ‌రుస వెబ్ సిరీస్‌ల‌కు ఓకే చెబుతూ..

Syndicate Bank: మీకు సిండికేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా.? జూలై 1 నుంచి ఇందులో మార్పు జ‌రగ‌నుంది.. గ‌మ‌నించండి.

Pakka Commercial: మాచోస్టార్ గోపీచంద్ న్యూ లుక్ అదిరిందిగా.. పక్క కమర్షియల్ నుంచి పోస్టర్..