జనవరి నాటికి కరోనా వైరస్ వ్యాక్సీన్ రెడీ ? హర్షవర్ధన్

వచ్చే ఏడాది ఆరంభానికల్లా (బహుశా జనవారినాటికి) దేశంలో కరోనా వైరస్ వ్యాక్సీన్ అం దుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.

జనవరి నాటికి కరోనా వైరస్ వ్యాక్సీన్ రెడీ ? హర్షవర్ధన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 17, 2020 | 4:19 PM

వచ్చే ఏడాది ఆరంభానికల్లా (బహుశా జనవారినాటికి) దేశంలో కరోనా వైరస్ వ్యాక్సీన్ అం దుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇతర దేశాల్లో మాదిరే మన దేశం కూడా ఈ వ్యాక్సీన్ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని, మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయని ఆయన గురువారం రాజ్యసభకు తెలిపారు. ప్రధాని మోదీ గైడెన్స్ కింద ఓ నిపుణుల బృందం దీనిని పర్యవేక్షిస్తోందని, చాలావరకు పురోగతి సాధించగలిగామని ఆయన చెప్పారు. భారత్  బయో టెక్, జైడస్ క్యాడిలా కంపెనీలు జోరుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక పుణెలోని సీరం సంస్థ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ని త్వరలో ప్రారంభించబోతోందన్నారు.