అక్క‌డ..తొలి కరోనా పాజిటివ్ కేసు న‌మోదు

దేశంలో క‌రోనా ర‌క్క‌సి జ‌డ‌లు విప్పుకుంటోంది. రోజు రోజుకూ వైర‌స్ వ్యాప్తి విజృంభిస్తోంది. ప‌ల్లె ప‌ట్నం అనే తేడా లేకుండా దేశం న‌లుమూల‌ల‌కు క‌రోనా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కానీ,

అక్క‌డ..తొలి కరోనా పాజిటివ్ కేసు న‌మోదు

Updated on: Jun 20, 2020 | 4:24 PM

దేశంలో క‌రోనా ర‌క్క‌సి జ‌డ‌లు విప్పుకుంటోంది. రోజు రోజుకూ వైర‌స్ వ్యాప్తి విజృంభిస్తోంది. ప‌ల్లె ప‌ట్నం అనే తేడా లేకుండా దేశం న‌లుమూల‌ల‌కు క‌రోనా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కానీ, యానాం నియోజకవర్గంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.

యానాం నియోజ‌క‌వ‌ర్గం కనకాలపేట గ్రామంలో ఓ 12 ఏళ్ల‌ బాలుడికి కరోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యింది. కాగా, ఆ బాలుడు ఇటీవల హైదరాబాద్ నుంచి వ‌చ్చిన‌ట్లుగా గుర్తించారు. అత‌డిలో వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌టంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వ‌హించారు. రిపోర్ట్స్‌లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు క‌న‌కాలపేట గ్రామంలో క‌ట్టుదిట్ట‌మైన నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల‌ను కూడా అలెర్ట్ చేశారు. బాధితున్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.