ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు.. అమెరికాలోనే 10 లక్షలు!

| Edited By:

Apr 28, 2020 | 9:40 AM

ప్రపంచవ్యాప్తంగా 30,59,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 211202కి చేరింది. కొత్తగా సోమవారం 65,819 కేసులు నమోదవ్వగా.. 4,287 మంది..

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు.. అమెరికాలోనే 10 లక్షలు!
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30,59,081 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 211202కి చేరింది. కొత్తగా సోమవారం 65,819 కేసులు నమోదవ్వగా.. 4,287 మంది మరణించారు. కాగా గత నాలుగు వారాలుగా మృతుల సంఖ్య 5 వేలకు పైగానే దాటుతోంది.

అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 9,19,746మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 19,28,133 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 56281 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అత్యధికంగా ఈ దేశంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 10,08,043కి చేరింది. ఇక 56,649 మంది కరోనాతో మరణించారు. ఓవరాల్‌గా చూస్తే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా, కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా మరోసారి వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకూ 28,380క కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 886 మంది ప్రాణాలు కోల్పోగా, 6362 మంది డిశ్చార్జి అయ్యారు.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది