కరోనా ఎప్పుడు ముగుస్తుంది..? ఒమిక్రాన్‌తో ఎండ్ కార్డు పడేనా.. నిపుణుల పరిశోధనల్లో సంచలనాలు..

|

Feb 03, 2022 | 3:15 PM

కోవిడ్ రూపాంతరం ప్రపంచాన్ని మరింత ఆందోళన కలిగిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా అది చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది ఓ రూపంలో దాడి చేస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ అంతు చిక్కుండా ఉంది.

కరోనా ఎప్పుడు ముగుస్తుంది..? ఒమిక్రాన్‌తో ఎండ్ కార్డు పడేనా.. నిపుణుల పరిశోధనల్లో సంచలనాలు..
Coronas Virus
Follow us on

Omicron virus: కోవిడ్ రూపాంతరం ప్రపంచాన్ని మరింత ఆందోళన కలిగిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా అది చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది ఓ రూపంలో దాడి చేస్తోంది. తన రూపాన్ని మార్చుకుంటూ అంతు చిక్కుండా ఉంది. అయితే ఈ కోవిడ్-19 ఎప్పుడు ముగుస్తుంది..? ఒమిక్రాన్‌కు ఎండ్ కార్డు పడుతుంది..? ఇలా చాలా ప్రశ్నలకు నిపుణులు పరిశోధనలు మొదలు పెట్టారు. Omicron ఆవిర్భావం నుంచి మహమ్మారి భవిష్యత్తు గురించి చర్చ జరుగుతోంది. కోవిడ్ వైరస్ రూపాంతరం ఇక్కడితో ఆగుతుందా ఇలా మరొకటి.. మరొకటి వస్తూనే ఉంటాాయా..? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ అంశంపై ఆరోగ్య నిపుణులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. నవంబర్‌ 2019లో కనుగొనబడిన తర్వాత భారీగా పరివర్తన చెందింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా కనుగొనబడిన ఓమిక్రాన్‌ వ్యాప్తిపై నిపుణులు వివిధ రకాల అభిప్రయాలను వ్యక్తం చేస్తున్నారు.

వివిధ ప్రయోగశాలలలో చేసిన అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే 10 బిలియన్ డోస్‌లలో ప్రధాన భాగాన్ని కలిగి ఉన్న ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్‌లు ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా కొన్ని ప్రతిరోధకాలను పొందుతాయని సూచించాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఓమిక్రాన్ ఖచ్చితంగా కనిపించే కరోనావైరస్ చివరి రూపాంతరం మాత్రం కాదని అభిప్రాయా పడుతున్నారు.

కోవిడ్-19 చివరకు స్థానిక వ్యాధిగా మారుతుందని.. ప్రపంచం కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే దీనికి ఎండ్ కార్డ్ పడాలంటే మాత్రం వ్యాక్సిన్ ఒక్కటే అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..

RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..