AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారిస్‌లో సితార న‌ృత్యం.. అదిరిందంటున్న నెటిజన్లు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తన కూతురు సితార చేసిన నృత్యంను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చిన్నారి చేస్తున్న డ్యాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌గా మారుతోంది.

పారిస్‌లో సితార న‌ృత్యం.. అదిరిందంటున్న నెటిజన్లు
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2020 | 10:28 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార.. నెటిజన్లకు పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే అంతలా పాపులారిటి సంపాదించింది చిన్నారి సితార. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తూనే ఉంటుంది బేబి సితార. ఇప్పుడు లాక్‌డౌన్‌ కావడంతో నాన్నతో ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సితార.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత తన కూతురు సితార చేసిన నృత్యంను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పారిస్ వెళ్లిన సమయంలో తీసినట్లుగా చెప్పారు. తను ఎక్కడున్నా… నేర్చుకుంటున్న డ్యాన్స్ ప్రాక్టీస్‌ను మాత్రం ఆపదని తెలిపారు. హైదరాబాద్‌లో ఓ డ్యాన్స్ మాస్టర్ వద్ద డ్యాన్స్ నేర్చుకుంటోంది సితార. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అయితే సితార డ్యాన్స్ వీడియో వైరల్ కావటం ఇదే తొలిసారి కాదు. గతంలో… ప్రిన్స్ నటించిన ‘మహర్షి’ చిత్రంలోని పాలపిట్టా సాంగ్ కి సీతారా చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది.

View this post on Instagram

Ufff ! How adorable are u ! U give me reason to smile everyday ❤️❤️❤️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on