ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే నయమని కొన్ని వార్తలు చదివితే అనిపిస్తుంటుంది. అసలే ఇప్పుడు కరోనా కాలం.. మాస్క్ లేకుండా బయట తిరిగితే మహమ్మారి సోకడం ఖాయం. గాలి ద్వారా కూడా వైరస్ ప్రభలే ఛాన్స్ ఉందని ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. దీంతో చాలా మంది మాస్క్, శానిటైజర్స్ లేకుండా అడుగు బయట పెట్టడం లేదు. మరో వైపు మాస్క్ లేకుండా.. బయటకు రావద్దంటే.. అలానే తిరుగుతున్నారు కొంతమంది. ఈ విషయాన్ని కీలకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మాస్క్ పెట్టుకోకుండా బయట తిరుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఆ సంగతి ఈ కోతికి కూడా తెలిసినట్టుంది.. అది కూడా మాస్క్ పెట్టుకుని తిరుగుతోంది.
కోతి అంటే అల్లరికి మారు పేరు. అది చేసే పనులు కూడా అలానే ఉంటాయి. మనుషులను చూసి అది నేర్చుకుందా? లేక కరోనా వైరస్‌కి భయపడిందో ఏమో కాని.. రోడ్డు మీద పడిపోయి ఉన్న ఓ బట్టను తీసుకుని ముఖానికి చుట్టుకుని అక్కడక్కడా చకచకా తిరిగింది. బట్టను మూతి, ముక్కు చుట్టూ చుట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఇది చూసిన కొంత మంది దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నందా దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
After seeing head scarfs being used as face mask?? pic.twitter.com/86YkiV0UHc
— Susanta Nanda IFS (@susantananda3) July 7, 2020
Read More:
తిరుమల కంటైన్మెంట్ జోన్ కాదు.. క‌్లారిటీ ఇచ్చిన కలెక్టర్..
కరోనా వైరస్‌తో హీరో తండ్రి మృతి.. విషాదంలో కుటుంబం
కరోనాకు చెక్ పెట్టేందుకు తక్కువ ధరకే మరో జనరిక్ మెడిసిన్..