వందే భారత్ మిషన్ 2: ఏపీకి రానున్న నాలుగు విమానాలు ఇవే..

|

May 13, 2020 | 3:38 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపధ్యంలోనే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇక వారిని సొంత ప్రాంతాలకు తీసుకురావడానికి మోదీ సర్కార్ వందే భారత్ మిషన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండో విడతలో ఆంధ్రప్రదేశ్‌కు విదేశాల నుంచి త్వరలోనే నాలుగు ప్రత్యేక విమానాలు రానున్నాయి. వీటి గురించి పూర్తీ వివరాలు తెలుసుకోవడానికి ప్రవాసాంధ్రులు ఆయా దేశాల ఇండియన్ ఎంబసీలను సంప్రదించాల్సి ఉంటుంది. కాగా, దేశవ్యాప్తంగా […]

వందే భారత్ మిషన్ 2: ఏపీకి రానున్న నాలుగు విమానాలు ఇవే..
Follow us on

దేశంలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ నేపధ్యంలోనే చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఇక వారిని సొంత ప్రాంతాలకు తీసుకురావడానికి మోదీ సర్కార్ వందే భారత్ మిషన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రెండో విడతలో ఆంధ్రప్రదేశ్‌కు విదేశాల నుంచి త్వరలోనే నాలుగు ప్రత్యేక విమానాలు రానున్నాయి. వీటి గురించి పూర్తీ వివరాలు తెలుసుకోవడానికి ప్రవాసాంధ్రులు ఆయా దేశాల ఇండియన్ ఎంబసీలను సంప్రదించాల్సి ఉంటుంది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కేసుల 74 వేలు పైగా నమోదయ్యాయి. అటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

ప్రత్యేక విమానాల లిస్టు:

  • సౌదీఅరేబియా – విజయవాడ (20/05)
  • ఖతర్ – విశాఖపట్నం(20/05)
  • లండన్ – విజయవాడ(20/05)
  • కువైట్ – తిరుపతి(21/05)

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!