ప్రియాంక గాంధీ అభ్యర్థన….యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకారం

| Edited By: Pardhasaradhi Peri

May 18, 2020 | 6:55 PM

వలస కార్మికుల అవస్థలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లేఖకు స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వెంటనే వారి తరలింపునకు 12 వేల బస్సులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సహా వివిధ రాష్టాల్లో ఉన్న యూపీకి చెందిన వలస జీవులను తిరిగి స్వరాష్ట్రానికి రప్పించేందుకు తక్షణమే ఈ బస్సులు తరలేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వారికి ఒక్కో జిల్లాకు 200 బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అదనంగా 15 వేల బస్సులను సిధ్ధంగా […]

ప్రియాంక గాంధీ అభ్యర్థన....యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకారం
Follow us on

వలస కార్మికుల అవస్థలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లేఖకు స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వెంటనే వారి తరలింపునకు 12 వేల బస్సులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సహా వివిధ రాష్టాల్లో ఉన్న యూపీకి చెందిన వలస జీవులను తిరిగి స్వరాష్ట్రానికి రప్పించేందుకు తక్షణమే ఈ బస్సులు తరలేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వారికి ఒక్కో జిల్లాకు 200 బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అదనంగా 15 వేల బస్సులను సిధ్ధంగా ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు. వలస కార్మికులకు ఆహారం, నీటి వసతి, షెల్టర్లు ఏర్పాటు చేయాలని  కూడా  ఆయన ఆదేశించారు.  ఇటీవల వలస జీవుల వెతలపై తీవ్ర ఆందోళన చేసిన ప్రియాంక గాంధీ.. రాజకీయాలకు ఇది సమయం కాదని, కాలినడకన వందల కిలోమీటర్ల దూరం వెళ్తున్న వీరిని ఆదుకోవాలని కోరుతూ యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. ఢిల్లీ సరిహద్దుల్లో వందలాది బస్సులు నిలిచి ఉన్నాయని. ఆ బస్సుల్లో మీ రాష్ట్రానికి చెందిన కార్మికులను తరలించేందుకు అనుమతించాలని ఆమె అభ్యర్థించారు. ఇందుకు యోగి కూడా సమ్మతించారు.