ఆక్సిజన్ పై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. తగ్గని జ్వరం

| Edited By: Pardhasaradhi Peri

Apr 06, 2020 | 6:04 PM

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిన్న లండన్ డౌనింగ్ స్ట్రీట్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆక్సిజన్ ఇస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. 10 రోజులుగా క్వారంటైన్ లో ఉన్నప్పటికీ..

ఆక్సిజన్ పై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. తగ్గని జ్వరం
Follow us on

కరోనా వ్యాధికి గురైన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిన్న లండన్ డౌనింగ్ స్ట్రీట్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆక్సిజన్ ఇస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. 10 రోజులుగా క్వారంటైన్ లో ఉన్నప్పటికీ.. ఆయనలో కరోనా పాజిటివ్ లక్షణాలు తగ్గలేదని, జ్వరం కూడా అదే స్థాయిలో ఉందని వారుచెప్పారు. ఆయన శరీరంలో ఇంకా కిల్లర్ వైరస్ అలాగే ఉందని, అయితే ఆయనకు నిర్విరామంగా అన్ని చికిత్సలూ అందుతున్నాయని పేర్కొన్నారు. తన ఆరోగ్యాన్ని బోరిస్ రిస్క్ లో పెడుతున్నారని టాస్క్ ఫోర్స్ ముందే హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదని, పాలనా సంబంధ బాధ్యతలు నిర్వహిస్తూ రావడం వల్లే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత జటిలంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఉద్దేశించిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కు ఆయన డిప్యూటీ డొమినిక్ రాబ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రోజూ జరిగే ఈ టాస్క్ ఫోర్స్ సమావేశాలకు ఇక ఈయనే అధ్యక్షత వహించనున్నారు. తమ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం కొంత విషమంగా ఉందని వార్తలు రావడంతో బ్రిటన్ వాసుల్లో ఆందోళన మొదలైంది.