మేము సైతం.. తాటాకు మాస్కులతో గిరిజన మహిళలు.. ఎక్కడంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Mar 26, 2020 | 6:30 PM

ఛత్తీస్ గడ్ లోని బస్తర్ జిల్లాలో మారుమూలాల్లోని  గిరిజన గ్రామాల మహిళలు తాము కూడా మాస్కులు ధరించారు. అవేవీ ఖరీదయినవో, అధునాతనమైనవో కావు.. కరోనా భయం గురించి వీరికి ఎలా తెలిసిందో గానీ.. కేవలం తాటాకులతో తాము స్వయంగా తయారు చేసుకున్న తాటాకు మాస్కులు ఇవి ! ఇలా వారు తమను తాము రక్షించుకుంటున్నారు. పైగా లాక్ డౌన్ నేపథ్యంలో బయటకు రాకుండా తమ ఇళ్లలోనే ఉంటున్నారు. కంకేర్, ఇతర గ్రామాల వారు…  ప్రభుత్వ అధికారుల సూచనలు, […]

మేము సైతం.. తాటాకు మాస్కులతో గిరిజన మహిళలు.. ఎక్కడంటే ?
Tribals
Follow us on

ఛత్తీస్ గడ్ లోని బస్తర్ జిల్లాలో మారుమూలాల్లోని  గిరిజన గ్రామాల మహిళలు తాము కూడా మాస్కులు ధరించారు. అవేవీ ఖరీదయినవో, అధునాతనమైనవో కావు.. కరోనా భయం గురించి వీరికి ఎలా తెలిసిందో గానీ.. కేవలం తాటాకులతో తాము స్వయంగా తయారు చేసుకున్న తాటాకు మాస్కులు ఇవి ! ఇలా వారు తమను తాము రక్షించుకుంటున్నారు. పైగా లాక్ డౌన్ నేపథ్యంలో బయటకు రాకుండా తమ ఇళ్లలోనే ఉంటున్నారు. కంకేర్, ఇతర గ్రామాల వారు…  ప్రభుత్వ అధికారుల సూచనలు, సలహాలకు వేచి ఉండకుండా తమకు తాము స్వీయ రక్షణలో ఉంటున్నారు. పైగా 21 రోజుల లాక్ డౌన్ కూడా పాటిస్తున్నారు. నిరక్షరాస్యులైనా.. వీరికి జాగ్రత్తలు ఎక్కువ.. ఛత్తీస్ గడ్ లో ఇప్పటివరకు మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. లండన్ నించి  రాయపూర్ కి ఓ ‘కరోనా మహిళ’ చేరుకోవడంతో ఈ సంఖ్య మూడుకు పెరిగింది.