ఏపీ కరోనా బులిటెన్… గడిచిన 24 గంటల్లో కొత్తగా 667 పాజిటివ్ కేసులు..

వైరస్ కారణంగా ఏపీలో 24 గంటల వ్యవధిలో తొమ్మిది మంది మృతి చెందారు. 914 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,04,10,612 సాంపిల్స్‌ను పరీక్షించారు.

ఏపీ కరోనా బులిటెన్… గడిచిన 24 గంటల్లో కొత్తగా 667 పాజిటివ్ కేసులు..
Corona Andhra Pradesh

Edited By:

Updated on: Dec 06, 2020 | 6:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 667 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,69,077కి చేరింది. ఇందులో 5,910 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,56,134 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

వైరస్ కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. ఇక నిన్న 914 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 1,04,10,612 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 37, చిత్తూరు 105, తూర్పుగోదావరి 38, గుంటూరు 114, కడప 24, కృష్ణా 129, కర్నూలు 8, నెల్లూరు 24, ప్రకాశం 36, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 15, విజయనగరం 18, పశ్చిమ గోదావరి 86 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.