టిక్‌టాక్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన రేటింగ్…

| Edited By:

May 28, 2020 | 8:48 PM

గత కొంతకాలంగా ఇండియాలో టిక్‌టాక్ రేటింగ్స్ తగ్గిపోయాయని.. దాన్ని ఇండియాలో బ్యాన్ చేస్తారని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతి తక్కువకాలంలోనే టిక్‌టాక్‌ అత్యధిక పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం ఈ యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు రెండు కారణాలు.. ఒకటి కరోనా వైరస్ అయితే....

టిక్‌టాక్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన రేటింగ్...
Follow us on

గత కొంతకాలంగా ఇండియాలో టిక్‌టాక్ రేటింగ్స్ తగ్గిపోయాయని.. దాన్ని ఇండియాలో బ్యాన్ చేస్తారని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతి తక్కువకాలంలోనే టిక్‌టాక్‌ అత్యధిక పాపులారిటీ సాధించింది. ప్రస్తుతం ఈ యాప్ రేటింగ్ పూర్తిగా దిగజారిపోయింది. అందుకు రెండు కారణాలు.. ఒకటి కరోనా వైరస్ అయితే.. మరొకటి అనుచిత, ప్రేరేపిత, హింసాత్మక వీడియోల కారణంగా భారత యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక టిక్ టాక్ యాప్ చైనా ప్రోడక్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ రెండింటి కారణంగా కొన్ని రోజులుగా టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతోందన్న విషయం తెలిసిందే.

కాగా ఇదిలా ఉంటే ఇప్పుడు టిక్‌టాక్‌కు మళ్లీ రేటింగ్ పెరిగింది. టిక్‌టాక్‌ యాప్‌పై వచ్చిన 80 లక్షల నెగటివ్‌ రివ్యూలను గూగుల్ సంస్థ తొలగించింది. దీంతో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. ప్లేస్టోర్‌లో టిక్‌టాక్ 4.4 స్టార్‌ రేటింగ్‌తో మరలా యథాస్థితికి చేరుకుంది. అయితే గూగుల్‌ సంస్థ, టిక్‌టాక్‌తో కుమ్మక్కయిందని అందుకే అంత రేటింగ్ ఇచ్చిందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమయినా.. ఇది ఒక రకంగా టిక్‌టాక్ యూజర్లకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి:

నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు

నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?

మహిళలకు కేంద్రం బంపర్ ఆఫర్.. నెలకు రూ.4 వేల జీతం పక్కా!

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు